ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 8:06 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

BSNL కాపర్ వైర్ చోరీ ముఠా ఛేదన – 8 మంది నిందితులు అరెస్ట్. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పరిధితో పాటు వివిధ ప్రాంతాల్లో BSNL టవర్‌లకు సంబంధించిన కవచోరీ చేస్తున్న ముఠాను పోలీసులు విజయవంతంగా ఛేదించారు

BSNL కాపర్ వైర్ చోరీ ముఠా ఛేదన – 8 మంది నిందితులు అరెస్ట్. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పరిధితో పాటు వివిధ ప్రాంతాల్లో BSNL టవర్‌లకు సంబంధించిన కవచోరీ చేస్తున్న ముఠాను పోలీసులు విజయవంతంగా ఛేదించారు.

బెల్లంపల్లి:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 14.

ఈ కేసుల్లో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా IPS గారి ఆదేశాల మేరకు, మంచిర్యాల DCP శ్రీ ఎ. భాస్కర్ IPS గారి పర్యవేక్షణలో, ACP బెల్లంపల్లి శ్రీ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, పోలీసు అధికారులు మరియు ప్రత్యేక బృందాలు సమన్వయంతో నిరంతరం దర్యాప్తు చేపట్టి, సాంకేతిక ఆధారాలు మరియు ఇతర సమాచారాన్ని విశ్లేషిస్తూ నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన నిందితుల వివరాలు.1.ఉప్పరి సంపత్ 2.గోమాస అజయ్ కృష్ణ 3. గోమాస అనుకృష్ణ 4. దుర్గం శేఖర్ 5. దుర్గం అంకుల్ 6. పాండి రాజకుమార్ 7.మారినేని రాజకుమార్.8సాంబొజు రాజకుమార్.

అరెస్ట్ చేసిన నిందితులను గౌరవనీయ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.

దర్యాప్తు కొనసాగింపు – గ్యాంగ్‌లపై ప్రత్యేక నిఘా
BSNL కాపర్ వైర్ చోరీలకు సంబంధించి నిందితుల గత నేర చరిత్ర, వారి గ్యాంగ్ కార్యకలాపాలు, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఇలాంటి చోరీ కేసుల్లో వారి ప్రమేయం తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.
అదేవిధంగా, సంబంధిత గ్యాంగ్‌లపై గ్యాంగ్ ఫైళ్లు మరియు సస్పెక్ట్ షీట్లు ప్రారంభించి, వారి నేర కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు, భవిష్యత్‌లో ఇలాంటి నేరాలకు పాల్పడకుండా అవసరమైన అన్ని చట్టపరమైన మరియు నిరోధక చర్యలు చేపడుతున్నారు.
ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు
ఈ కేసుల ఛేదనలో:

ACP CCS శ్రీ కె. రవికుమార్ ,CI CCS శ్రీ టి. గోపీ ,CI బెల్లంపల్లి రూరల్ శ్రీ CH. హనోక్ ,SI CCS శ్రీ భాస్కర్ రావు ,SI తల్లగురిజాల శ్రీ రామకృష్ణ

  1. సబ్‌డివిజన్ పోలీస్ సిబ్బందిCCS ప్రత్యేక బృందంసమన్వయంతో సమర్థవంతంగా కృషి చేశారు.

ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తులు మరియు టెలికాం మౌలిక వసతుల పరిరక్షణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. కాపర్ వైర్ చోరీలు, టెలికాం పరికరాల చోరీలు మరియు ఇతర నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.